Site icon NTV Telugu

Iron leg Pooja: బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. వరుస ఫ్లాపులతో వెకేషన్ మూడ్‎లోకి పూజాహెగ్దే

Pooja

Pooja

Iron leg Pooja: ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు అంటూ..’ అల్లు అర్జున్ పొగిడేస్తూ పూజా హెగ్దేను బుట్ట బొమ్మను చేశారు.. కానీ ఆమెకు కాలం కలిసి రాలేదు ఇటీవల తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా తొలినాళ్లలాగే ఇప్పుడు మళ్లీ అమ్మడు మీద ఐరన్ లెగ ముద్రపడింది. పూజాహెగ్డే ఆరంభంలోనే బ్యాక్ టూ బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దాంతో పాన్ ఇండియా హీరోలతో నటించే ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ సూపర్ స్టార్ల సరసన మెరిసింది. కానీ అమ్మడి మెరుపులు ఎంతో కాలం కొనసాగలేదు. పూజకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ తాండవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏడాది ఇప్పటివరకూ ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. ఇదే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయినా వాటిలో ఒక్క విజయం కూడా లేదు.

Read Also: Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య

ఏడాది ఆరంభంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `రాధేశ్యామ్`, విజయ్ సరసన నటించిన `బీస్ట్` ఫ్లాప్ అయ్యాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడికి నటించిన `ఆచార్య` ఫలితం గురించి చెప్పాల్సిన పనిలేదు. పూజా కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ ఇది. `ఎఫ్-3` లో ఐటం భామగా నటించిన అది యావరేజ్ గా ఆడింది. విజయ్ దేరవకొండ సరసన నటిస్తున్న `జనగణమన` మధ్యలోనే ఆగిపోయింది. ఇలా వరుస వైఫల్యాలతో పూజపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ప్రస్తుతం పూజా చేతిలో ఎస్ ఎస్ ఎంబీ 28వ సినిమా తప్ప కొత్త ప్రాజెక్ట్ లు ఏవి లేవు. ఇప్పుడా ఒత్తిడిని జయించేందుకు వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సమయం కూడా దొరకడంతో కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Exit mobile version