తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కంగువ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా కంగువ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు..
ఇక ట్విట్టర్‌లో అయితే కంగువ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. సిరుత్తై శివ దర్శకత్వంలో వస్తున్న కంగువ టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కావాల్సి ఉంది.. ఇంతలోనే సూర్య ఫ్యాన్స్ కు సుధా కొంగర బ్యాడ్ న్యూస్ చెప్పారు.. కంగువ తర్వాత సూర్య 43 సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుంది.. సూర్య ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు..
అయితే ఈ సినిమా త్వరలోనే మొదలుకానుందని మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. కానీ ఇంతలోనే డైరెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్తూ పోస్ట్ చేశారు.. పురాణనూరు సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం కావాలి. ఈ కాంబో చాలా స్పెషల్. మీకు ఎప్పుడూ ది బెస్ట్ ఇవ్వడం కోసమే మేము ప్రయత్నిస్తాం. త్వరలోనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది.. మీ అభిమానం ఇలానే ఉండాలి.. ధన్యవాదములు అంటూ ప్రకటన చేశారు..సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం.. ఇక కంగువ విషయానికొస్తే… మొత్తం 38 భాషల్లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివరిలో కంగువ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..
.#Suriya43#Puranaanooru @Sudha_Kongara pic.twitter.com/sykK5N2Ibb
— Suriya Sivakumar (@Suriya_offl) March 18, 2024