NTV Telugu Site icon

Police Brutality : అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం…

Police Toruture

Police Toruture

రక్షించాల్సిన రక్షకభటులే.. భక్షిస్తున్నారు.. తప్పుచేయనివారిని హింసించి.. తప్పు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన ఇది. అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం వెలుగులోకి వచ్చింది. చేయని దొంగతనం ఒప్పుకో వాలంటూ చిత్ర హింసలు గురిచేశారు. దెబ్బలు తాళలేక చేయని నేరం ఒప్పుకుంది లక్ష్మి అనే మహిళ .. ఏదో ఒకటి తెచ్చిస్తేనే వదిలేస్తామని పోలీసుల ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో చేసేదేం లేక.. భయంతో బాబాయ్ రాజేష్ చైన్ ను పోలీసులకు తెచ్చి ఇచ్చింది లక్ష్మీ.. అయినప్పటికీ వదలని రాక్షస రక్షకభటులు.. లక్ష్మిని రాజేష్ ను స్టేషన్ కు రావాలంటున్న సీఐ ఉపేంద్ర, ఎస్సై చంద్ర శేఖర్ హుకుం జారీ చేశారు. దీంతో.. చేయని నేరానికి స్టేషన్ ముందు పురుగుల మందు తాగాడు రాజేష్. దీంతో.. రాజేష్ ను గుట్టు చప్పుడు కాకుండా S.L.G hospitel లో జాయిన్ చేశారు పోలీసులు. అంతేకాకుండా.. ఖర్చు భరిస్తామని ఆసుపత్రి యాజమాన్యంకు హామీ ఇచ్చాడు సీఐ. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో రాజేష్ కొట్టుమిట్టాడుతున్నాడు. జరిగిన ఉదంతంతో లక్ష్మీ తో రాజీకి పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

పోలీసుల వివరణ ఇలా…  Pathan Mahabub Jani, Times of India Journalist , Bachupally అను వ్యక్తి తేదీ: 19.06.2024 నాడు తన ఇంట్లో 1) ఒక బంగారు చైన్, 2) ఒక బంగారు నెక్లెస్ మరియు 3) ఒక జత బంగారు చెవి కమ్మలు ఇట్టి మొత్తం వస్తువులు సుమారు 5 తులాల గలవి తేదీ:16.06.2024 నాడు దొంగాలిచబడినవి అని ఫిర్యాదు ఇవ్వగా బాచుపల్లి పోలీస్ వారు Cr No 605/2024 U/s 380 IPC Of PS Bachupally క్రింద కేసు నమోదు చేసినాము. సదరు ఫిర్యాదు దారుడు గారు ఇట్టి దొంగతనం వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి అయిన చిత్తారపు లక్ష్మి అను ఆమె పై దొంగతనం చేసి ఉండవచ్చు అని అనుమానం తెలపాగా క్రైమ్ పోలీసు వారు తేదీ: 01.07.2024 నాడు సదరు చిత్తారపు లక్ష్మి ని మహిళా పోలీస్ సమక్షములో విచారణించగా తెలిపినది కదా, ఫిర్యాదు దారుడు వాళ్ళ ఇంట్లో పని చేయుటకు వెళ్ళి బంగారు చైన్ ను దొంగలించి అట్టి చైన్ ను మా ఆడపడుచు భర్త అయైన రాజేష్ కు ఇచ్చినాను తెలిపింది.

-రాజేశ్ ను కేసు నమోదు (19th June-2024 ) నుండి ఒక రోజు కూడా పి‌ఎస్ కు పిలువ లేదు.
-లక్ష్మిని కూడా మహిళా సిబ్బంది సమక్షములో విచారణ చేసినాము.
-ఈ రోజు రాజేశ్ అతని భార్య ఇద్దరు కలసి SLG Hospital Bachupally కి వెళ్ళి అడ్మిట్ అయినారు.
-అతను ప్రస్తుతం ఆరోగ్యంగా బాగానే ఉంది మాట్లాడుతున్నాడు.) అని పోలీసులు తెలిపారు.