Mahindra University Drugs Case: తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తుంటారు. బాగా చదువుకుని తమను ఉద్దరిస్తారని భావిస్తుంటారు. కానీ.. నేటి తరం విద్యార్థుల్లో బాగుపడదామనే లక్షణాలు మందగిస్తున్నాయి. మందు, సిగరెట్లు పోయి.. ఇప్పుడు ఏకంగా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. తాజాగా బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. విద్యార్థులు గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్లను అరెస్ట్ చేశారు. నోవెల్ల ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నాడు. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ.2500కు అమ్ముతున్నాడు. అంబటి గణేష్, శివకుమార్, జావెద్‌లు కీలక సూత్రధారులుగా ఉన్నారు. గంజాయి, ఓజీ కుష్ కలిపి సిగరెట్లు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఢిల్లీకి చెందిన అరవింద్ శర్మ, అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్ స్టార్ చేశాడు. ఢిల్లీకి చెందిన ముఠాతో నోవెల్ల అనే విద్యార్థి గంజాయి తెప్పిస్తున్నాడు.
READ MORE: 54 గంటల బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లతో OnePlus Nord Buds 3r లాంచ్!
ఇదిలా ఉండగా.. గంజాయి లభ్యత, విక్రయాలు, వినియోగం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. బహిరంగ మార్కెట్లో లభించే సామాన్య మత్తుపదార్థంగా గంజాయి మారిపోయింది. కొన్నిచోట్ల శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్‌స్పాట్లుగా మారాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం 10 నుంచి 50 కిలోల వరకు పట్టుబడుతున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులపై కేసులు నమోదు చేయడం వరకూ బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చౌకగా లభించడంతో పాటు గంజాయి తీసుకున్న విషయం చుట్టుపక్కల వారు గుర్తించలేకపోవడం ప్రధాన కారణం. అంతే కాకుండా మద్యం కంటే సులువుగా తక్కువ సమయంలోనే మత్తు ఆస్వాధించే అవకాశం ఉండటంతో గంజాయికి యువత ఆకర్షితులవుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే బానిసలుగా మారుతున్నారు.