డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read:Betting App Case : ఈడి ఎదుట హాజరైన నటుడు ప్రకాష్ రాజ్.. అరెస్ట్ తప్పదా?
సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇలా ఒకటేమిటి ఆ వైద్యులు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. నేడు వారు చేసిన తప్పిదాలకు ఓ శిశువు అనాథగా మారింది. రాజస్థాన్ దంపతుల ఇచ్చిన ఫిర్యాదుతో బయోలాజికల్ పేరెంట్స్ అరెస్టు అయ్యారు. తమ వద్ద శిశువును ఉంచుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఇష్టపడడం లేదు. బిడ్డకు జన్మనిచ్చిన అస్సాం దంపతులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు లో ఉన్నారు. దీంతో అధికారులు శిశువును అమీర్ పేట్ లోని శిశు విహార్ కు తరలించారు.
