ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా అద్భుత విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. . నేను జులై 13న నేను బేబీ ప్రీమియర్స్ చూశాను. అందరూ నా రెస్పాన్స్ కోసం వెయిట్ చేసారు.కానీ నేనేమీ మాట్లాడలేకపోయాను.. సినిమా చూడగానే మాటలు రాలేదు. మొదటిసారి నేను హీరో అనే భావన మర్చిపోయి ప్రేక్షకుడిగా సినిమాను బాగా ఎంజాయ్ చేశాను.
సాయి రాజేష్ ఒక బలమైన కథ చెప్పారు.ఆ కథ ఎంతగానో ప్రభావితం చేసిందని అర్థం అవుతుంది. సొసైటీల్లో ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. అలా అని అందరూ అలాంటి అమ్మాయిలే లేరు. నాకు మాత్రం అందమైన మనసున్న అమ్మాయిలే కనిపించారు..నా తమ్ముడు నటుడు అవుతానంటే ఎంతో కష్టం అని చెప్పాను. నటన అంత ఈజీ కాదనీ చెప్పాను. నా దగ్గరకు చిన్న విషయం కూడా తీసుకురాడు. బేబీ మూవీ కథ కూడా నాకు చెప్పలేదు. తాను సొంతగా ఎదగాలని నేను కోరుకున్నాను అదే చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో నటుడు విరాజ్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు..హీరోయిన్ వైష్ణవి చైతన్య తన అద్భుతమైన నటనతో అదరగొట్టింది.ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ కి ఆమె పేరెంట్స్ ఎంతో హ్యాపీగా వున్నారని ఆయన తెలియజేశారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.