Site icon NTV Telugu

Babu Mohan: టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్

Babu Mohan

Babu Mohan

Babu Mohan: మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫోట్‌ను షేర్ చేసుకున్నారు. ఆగస్టులో బాబుమోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు.

Read Also: CPI Narayana: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నారాయణ సీరియస్

2018లో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్​ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 04న ప్రజా శాంతి పార్టీలో చేరాడు. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Exit mobile version