Babar Azam Chat: బాబర్ అజామ్ ప్రైవేట్ చాట్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam Private Whatsapp Chat Leaked: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. పేలవమైన ప్రదర్శన చేస్తోంది. మెగా టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాక్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బాబర్ అజామ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం అవుతుతుండడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా విఫలమవుతున్న బాబర్‌పై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. ప్రపంచకప్ 2023 ముగిసిన అనంతరం అతడి కెప్టెన్సీపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు పీసీబీకి మరో తలనొప్పి వచ్చి పడింది.
పాకిస్తాన్ జట్టుకు బోర్డు నుంచి సరైన సహకారం లేదని, గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయం గురించి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా, మెసేజ్ చేసినా అతడు రియాక్ట్ అవ్వలేదని మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ పేర్కొన్నాడు. అంతేకాదు బాబర్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టీవీ ఛానల్లో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
అయితే లీకైన చాటింగ్‌లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. బాబర్ అజామ్, సల్మాన్ నసీర్ వాట్సాప్ చాటింగ్ ఇలా ఉంది. ‘బాబర్ అజామ్.. నువ్వు ఫోన్ చేస్తే ఛైర్మన్ స్పందించడం లేదని టీవీల్లో, సోషల్ మీడియాలో న్యూస్ వస్తోంది. నువ్వు ఈ మధ్య ఏమైనా ఛైర్మన్‌కు ఫోన్ చేశావా?’ అని నసీర్ అడగ్గా.. ‘నమస్తే సల్మాన్ భాయ్.. నేను జకా అష్రఫ్‌కు కాల్ చేయలేదు’ అని బాబర్ రిప్లై ఇచ్చాడు. బాబర్ ప్రైవేట్ చాట్‌ను లీక్ చేయడంపై పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!