Babar Azam: టీ20 క్రికెట్‌లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీ గురించి చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకరికి మించి రికార్డులు బద్దలు గొడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ మరో మైలు రాయిని సాధించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) క్వాలిఫైయర్ మ్యాచ్‌లో బాబర్ ఆజం విశ్వరూపం ప్రదర్శించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన కీలక పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బాబర్.. ఒత్తిడిలోనూ అద్భుత సెంచరీతో పెషావర్ జల్మీని ఫైనల్‌కు చేర్చాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. కరాచీలోని కష్టతరమైన పిచ్‌పై బాబర్ మెరుపులు మెరిపించడంతో జల్మీ జట్టు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ 151 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ ఘనవిజయం సాధించింది. బాబర్‌కు తోడుగా మహమ్మద్ హారిస్, కుశాల్ మెండిస్, ఆరోన్ హార్డీ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఇక, ఈ సెంచరీతో బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో పలు రికార్డులను తిరగరాశాడు. ఒక కెప్టెన్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాడిగా ఫాఫ్ డుప్లెసిస్ (8) రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మైఖేల్ క్లింగర్ (7), విరాట్ కోహ్లీ (5), జేమ్స్ విన్స్ (5) బాబర్ కంటే వెనుకబడి ఉన్నారు. అలాగే పీఎస్ఎల్ చరిత్రలో ఇది బాబర్‌కు నాలుగో సెంచరీ కాగా.. అత్యధిక సెంచరీలు చేసిన ఉస్మాన్ ఖాన్ రికార్డును అతను సమం చేశాడు. ఈ సీజన్‌లో బాబర్ ఫామ్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఇప్పటివరకు 588 పరుగులు చేసిన అతను, ఒకే పీఎస్ఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఫఖర్ జమాన్ (2022) రికార్డును సైతం సమం చేశాడు. అంతేకాకుండా, ఒకే దేశంలో (పాకిస్థాన్‌లో) 8 టీ20 సెంచరీలు సాధించి.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మల పేరిట ఉన్న రికార్డును సైతం అందుకున్నాడు. తన ఫామ్ గురించి బాబర్ మాట్లాడుతూ.. “నేను నా పాత ఫామ్‌ను తిరిగి పొందుతున్నట్లు అనిపిస్తోంది. కష్టమైన విషయాలను సరళంగా ఆలోచిస్తూ, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నాను. పీఎస్ఎల్ కంటే ముందు నేను చేసిన కష్టమే ఇప్పుడు ఫలితాన్నిస్తోంది” అని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు