Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు, అతని ముందు తరాల వారు ఎందుకు అతనికి బాధ్యతలు అప్పగించారు అనే అంశాలతో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక సినిమా చేసే యోచనతో ఆయన సినిమా కథ సిద్ధం చేయగా, దానికి ప్రస్తుతానికి ప్రీవిజువలైజేషన్ పనులు జరుగుతున్నాయి.
READ MORE: Indonesia: అతిపెద్ద ముస్లిం దేశంలో భయంకర వ్యాధి వ్యాప్తి.. ప్రాణం పోయినా ఆ వ్యాక్సిన్ వేసుకోరట..!
ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేస్తాడా లేక తన టీంలో ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అంతా చర్చల దశలోనే ఉంది. కానీ, సినిమాగా రూపాంతరం చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి, బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది. ఈ మధ్యలో కూడా జపాన్, చైనా వంటి దేశాల్లో రిలీజ్ చేసినా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి, రాజమౌళి కట్టప్ప బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేసి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు.
READ MORE: AP Police: ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!
