Site icon NTV Telugu

Baahubali Epic: దేశమంతా ఎదురుచూసే బాహుబలిని అక్కడే చూస్తున్న జక్కన్న..

Ss Rajamouli

Ss Rajamouli

Director SS Rajamouli attended the Baahubali Epic re-release premiere: బాహుబలి.. భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్‌లో అవుతున్నాయి. అయితే.. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ పీవీఎక్స్‌ స్క్రీన్‌లో బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ ప్రీమియర్‌కి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. దేశమంతా ఎదురుచూసే బాహుబలిని ఫ్యామిలీతో కలిసి తిలకించారు. జక్కన రాకతో థియోటర్‌లో సందడి నెలకొంది.

READ MORE: Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ..? ఎంఐ పోస్టుతో మొదలైన రచ్చ..!

మరోవైపు.. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై ఇటీవల ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించిన అనేక విషయాలను కూడా పంచుకున్నారు. అయితే ఎడిటింగ్ లో ఏమేం తీసేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమౌళి ముందే అన్నీ చెప్పేశాడు. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్‌, కన్నా నిదురించరా సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లను తీసేశామని తెలిపాడు రాజమౌళి. యుద్ధానికి సంబంధించిన సీన్లు తీసేయడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Exit mobile version