ఈనెల 15న బీవై విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులైన సంగతి తెలిసిందే. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత ఎన్నికపై బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చిస్తానని తెలిపారు. ఈరోజు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైని కలిశాను.. ఈ నెల 15న పార్టీ కార్యాలయంలో అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. ప్రతిపక్ష నేత ఎంపికపై గురువారం లేదా శుక్రవారం తమ బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించి వారి అభిప్రాయం తీసుకుంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ అంశంపై ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చిస్తానని బీవై విజయేంద్ర తెలిపారు.
Read Also: Kishan Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ కట్టుబడి ఉంది..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పదవికి ముగ్గురు సీనియర్ నేతలు ముందున్నట్లు సమాచారం. వీరిలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన సునీల్ కుమార్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీఎన్ అశ్వత్నారాయణ, వొక్కలిగ సామాజికవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొకరు పద్మనాభనగర్‌కు చెందిన ఆర్ అశోక్, వొక్కలిగ సామాజికవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.