హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురు అయింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే, మరోవైపు డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందు వల్లే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ వెల్లడించింది.
Read Also: Rathinirvedam: శృంగారభరిత ‘రతి నిర్వేదం’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
కాగా, ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్‍సీఏ ఎన్నికలకు ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక, అక్టోబర్ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఛాన్స్ కల్పించారు. అక్టోబరు 20న ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం, అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. అయితే, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను దీని ద్వారా ఎన్నుకోనున్నారు.
Read Also: Shriya Saran : లాంగ్ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న శ్రీయ.. ఇలా చూపిస్తే ఎలా పాప..
మహ్మద్ అజహరుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాలతో హెచ్‌సీఏకు సంబంధించి పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. దీనిపై పలుమార్లు విచారణ చేసిన సుప్రీంకోర్టు.. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే సరైన మార్గమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తుంది. గత ఏడాది ఆగస్టు 22న హెచ్‌సీఏ పర్యవేక్షణ కోసం జస్టిస్ కక్రూ నేతృత్వంలో కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.. అయితే, ఆ కమిటీ సభ్యుల్లోనూ విభేదాలు రావడంతో ఆ కమిటీని రద్దు చేసి హెచ్‌సీఏ రోజు వారీ కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది.
