NTV Telugu Site icon

Ayodhya: రాముడి గర్భగుడిలోకి వర్షపు నీరు.. వీడియోలు విడుదల

Leke

Leke

ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ సర్కార్ అయోధ్యలో నిర్మించిన రామమందిరం ఒక్క వర్షానికే ప్రభావం చూపించింది. సోమవారం కురిసిన వర్షానికి నీరు లీకేజ్ అయింది. బీజేపీ ప్రభుత్వం 2024 జనవరి 22న ఎంతో అట్టహాసంగా ఆలయాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని రోజులకే గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది. తొలిసారి వర్షం కురిసినప్పుడే గర్భాలయంలోకి నీరు వచ్చి చేరాయని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ చెప్పారు. దీంతో రామ మందిర నిర్మాణ పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పైభాగాన్ని సరిగ్గా అమర్చని వారిపై చర్యలు తీసుకోవాలని సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలేంటో గుర్తించి వాటిని ఒకట్రెండు రోజుల్లో పరిష్కరించాలని కోరారు. అసలే వర్షాకాలం కావడంతో సమస్య పరిష్కరించకుంటే పూజలు చేయడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Tamayo Perry: సొర చేపల దాడిలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు మృతి

వాస్తవానికి రామమందిరం ప్రారంభించి 6 నెలలు కూడా కాలేదు. కానీ రామ మందిరం పైకప్పు నుంచి వర్షం నీరు లీక్ కావడం ప్రారంభమైంది. అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలో ఆలయ ఘటాలు నిర్మిస్తున్నామని, అక్కడ ఇతర విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఈ పనుల కోసం ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి విగ్రహాల ప్రతిష్ఠాపన జరగడం సంతోషించదగ్గ విషయం అన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి