Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్య రామాలయ నిధుల వివాద వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రక్రియను సాకుగా చూపిస్తూ, ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వివరాలను వెల్లడించడానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ నిరాకరించింది. చివరికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ద్వారా జిల్లా యంత్రాంగానికి అందిన లేఖకు సైతం సమాధానం ఇచ్చేందుకు ట్రస్ట్ నిరాకరించడం గమనార్హం.
అయోధ్యకు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్.. రామాలయ ట్రస్ట్‌కు వస్తున్న విరాళాలు, బ్యాంకు ఖాతాలు, భూముల కొనుగోలు, అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆలయ ట్రస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు, సమకూరిన ఆస్తుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ ఆయన జూన్ 9న మొదటిసారి, ఆ తర్వాత జూన్ 12న రెండోసారి పీఎంఓకు ఫిర్యాదులు పంపారు. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 13న ఈ వ్యవహారంపై సిట్ (SIT) ఏర్పాటయింది. బీజేపీ నేత చేసిన ఈ ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించి, తదుపరి చర్యల కోసం అయోధ్య జిల్లా పరిపాలన విభాగానికి పంపింది. పీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం.. ఆలయ ఆదాయ-వ్యయాల లెక్కలు అప్పగించాలంటూ రామాలయ ట్రస్ట్‌ను కోరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 23న అయోధ్య ఏడీఎం (పరిపాలన) విశు రాజాకు రాసిన ఒక లేఖలో, ఏడీఎం (శాంతిభద్రతలు) ఇంద్రకాంత్ ద్వివేది ఈ విషయాలను ప్రస్తావించారు. పీఎంఓ పంపిన ఫిర్యాదు ఆధారంగా తాము రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను సంప్రదించి విరాళాల లెక్కలు అడిగామని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు ప్యానెల్ అన్ని కీలక రికార్డులను సేకరిస్తోందని చెబుతూ చంపత్ రాయ్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు ఏడీఎం తెలిపారు. విచారణ నడుస్తున్నందున ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ట్రస్ట్ స్పష్టం చేసింది.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!