NTV Telugu Site icon

Ayodhya Ram Mandir: సికింద్రాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా!

Special Trains

Special Trains

Secunderabad to Ayodhya Trains and Timings: దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహోత్తర ఘట్టం పూర్తయింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సోమవారం అట్టహాసంగా సాగింది. ఈ అద్భుత క్షణాలను కళ్లారా వీక్షించేందుకు.. దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడాకారులతో పాటు రామ భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళ్లారు. ఇక మంగళవారం (జనవరి 23) నుంచి సాధారణ భక్తులకు కూడా రామ్‌లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. దాంతో రామ మందిరం దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

రామ్‌లల్లా దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దక్షిణమధ్య రైల్వే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులు ఉన్నాయి. జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.

Also Read: JEE Mains 2024: నేటి నుంచే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఇవే!

ఇక ప్రతిరోజు సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌కు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలులో టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ఉదయం 10.40 గంటలకు బయలుదేరి అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.