Site icon NTV Telugu

Ayodhya: ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరు

Ayodhya

Ayodhya

Ayodhya Railway Station: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రైల్వే శాఖ ముందుకు తీసుకుపోగా.. ఆ ప్రతిపాదనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అయోధ్య రైల్వే జంక్షన్ కాస్తా.. అయోధ్య ధామ్ జంక్షన్’గా మారిపోయింది.

Read Also: Bhatti Vikramarka: అందరికి ఒకటే మాట.. ఆరో తేదీ వరకు ధరఖాస్తు తీసుకుంటాం..

ఇక, యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీసీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనుంది. దీంతో రామయ్యను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అయోధ్య నగరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉండటంతో ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అత్యాధునిక సదుపాయాలతో అయోధ్యలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేసింది. ఈ రైల్వే స్టేషన్‌ను డిసెంబర్ 30వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అదే రోజు అయోధ్యలోని ఎయిర్ పోర్టును సైతం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

Exit mobile version