NTV Telugu Site icon

Yogi Adityanath: అయోధ్యలో దీపోత్సవ్.. ఆ రికార్డ్ మీద కన్నేసిన యోగి సర్కార్

Yogi Adhithyanath

Yogi Adhithyanath

ఉత్తరప్రదేశ్‌లో దీపోత్సవ్ 2023 ఏడవ ఎడిషన్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని యూపీ సర్కార్ చూస్తోంది. గత ఏడాది దీపావళి సందర్భంగా 15.76 లక్షల దీపాలను వెలిగించి రికార్డు నమోదు చేసింది. ఈసారి కూడా మరో ఘనత సాధించడానికి 51 ఘాట్లలో దీపాలు వెలిగించేందుకు రెడీ అయింది.

Read Also: Fire in Dal lake: కాశ్మీర్‌లోని దాల్ సరస్సులోని పడవల్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

రామ్ కి పైడిలోని 51 ఘాట్‌లలో 24 లక్షలకు పైగా దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డ్ సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే దీపోత్సవాల్లో 25 వేల మంది వాలంటీర్లు ఈ దీపాలను వెలిగించనున్నారు. ఈ సంవత్సరం, రామ్ కీ పౌరిలో లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తో షో ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయోధ్య, ఉత్తర ప్రదేశ్ చరిత్రను ప్రదర్శించేందుకు దేశంలోనే అతి పెద్ద భారీ డిజిటల్ స్ర్కీన్ ను సైతం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

Read Also: Hyderabad Double Decker Buses: ఫ్రీ.. ఫ్రీ.. డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఇక, వాలంటీర్లకు ఇటీవల దీపాలను వెలిగించడం.. వాటి నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చారు. వాలంటీర్లు వివిధ సంస్థలు 27 కళాశాలలు, అయోధ్యలోని 19 ఇంటర్మీడియట్ కాలేజీలు, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ, దీపాలను వెలిగించే నోడల్ ఏజెన్సీకి అనుబంధంగా ఉంటున్నారు. రామ్ కి పౌరిలోనే దాదాపు 65,000 దీపాలు వెలిగించనున్నారు. 51 ఘాట్లతో పాటు అయోధ్యలోని ముఖ్యమైన మతపరమైన, చారిత్రక ప్రదేశాలలో కూడా దీపాలను వెలిగించేందుకు రెడీ అవుతున్నారు. వీటిని క్రమబద్ధంగా, ఈజీగా లెక్కించడానికి 196 దీపాలు చొప్పున 12,500 బ్లాక్‌లలో వెలిగించనున్నారు.

Read Also: Rajahmundry Road Cum Railway Bridge: 45 రోజుల తర్వాత అందుబాటులోకి రోడ్ కం రైల్వే బ్రిడ్జి

అలాగే, దీపావళి రోజున విద్యుత్ అందించడానికి అధికారులు, ఉద్యోగుల సెలవులను యూపీ సర్కార్ రద్దు చేసింది. SDO, JE సహా కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక విధుల్లో ఉండనున్నారు. అలాగే అర్బన్ సెక్షన్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి విద్యుత్ కార్పొరేషన్ టౌన్ హాల్ దగ్గర కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా ఉద్యోగులను నియమిస్తారు. దీపావళి రోజున ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అధికారులు సిస్టమ్‌ను పరిశీలిస్తారు.

Show comments