NTV Telugu Site icon

Axar Patel: తండ్రైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. విషయం ముందే చెప్పిన రోహిత్!

Axar Patel Child

Axar Patel Child

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ అక్ష‌ర్ ప‌టేల్ తండ్రయ్యాడు. అక్ష‌ర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్ష‌ర్ మంగ‌ళవారం (డిసెంబ‌ర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. డిసెంబ‌ర్ 19న తనకు కొడుకు పుట్టాడని, హక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు. అక్ష‌ర్‌కు ఫాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు.

అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బీసీసీఐ సెలక్టర్లు అక్ష‌ర్‌ను ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్ అనంతరం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మిగిలిన రెండు టెస్టులకు అక్ష‌ర్‌తో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అక్ష‌ర్‌ పితృత్వ సెలవుల్లో ఉండడంతో.. తనుష్ కోటియన్‌ను ఎంపిక చేశారు.

Also Read: IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్‌ శర్మ

మంగళవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ స్థానంలో కొటియన్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అక్షర్ తండ్రయ్యాడని, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే స్థితిలో లేడని చెప్పాడు. ఇక అక్షర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే ఆకాశం ఉంది. అక్షర్ ఇప్పటివరకు భారత్ తరఫున 14 టెస్టులు, 60 వన్డేలు, 66 టీ20లు ఆడాడు.

Show comments