NTV Telugu Site icon

Battery Charging: మీ ఫోన్ ఛార్జింగ్ 100% చేస్తున్నారా? అయితే మీ ఫోన్ రిస్క్లో పడ్డట్లే

Mobile Charging

Mobile Charging

Battery Charging: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. ఇకపోతే, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నా.. మనలో చాలామంది వినియోగదారులకు ఫోన్ బ్యాటరీ నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో మొబైల్ పనితీరు ప్రభావితమవుతుంది.

Read Also: Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది..

నిజానికి మొబైల్ లోని సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఉన్నప్పటికీ, బ్యాటరీ పనితీరు మెరుగుగా లేకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులపాటు మెరుగుగా పనిచేసేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మంలో కొద్ది మంది వారి ఫోన్‌ను 100% ఛార్జింగ్ చేయాలనీ చూస్తారు. అయితే, ఇలా తరచుగా చేస్తే బ్యాటరీ పనితీరు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయ్యే సమయంలో వేడెక్కడం మాములే. దీని ప్రభావం బ్యాటరీ మన్నికపై పడుతుంది. అయితే ఎప్పుడో ఒకసారి ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. అయితే, ప్రతిసారి 100% ఛార్జింగ్ చేస్తే మాత్రం దీర్ఘకాలిక ప్రభావం ఖచ్చితంగా పడుతుంది.

మరి బ్యాటరీ ఎక్కువ రోజు పని చేయాలంటే ఎంత సమయం వరకు ఛార్జింగ్ చేసుకోవాలనే కదా.. మీ అనుమానం. మరి బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కలిగేలా ఉంచాలంటే 80% దగ్గరే ఛార్జింగ్‌ను ఆపేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఛార్జింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే ఫోన్ 80% వరకు మాత్రమే ఛార్జింగ్ అవుతుంది.

Read Also: Shivaji : మంగపతి పాత్ర.. శివాజీ మరో విజయ్ సేతుపతి అవుతాడా..?

మరి మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా.. అవసరమైనప్పుడే ఫోన్‌ను ఛార్జింగ్ చేయాలి. 80% వరకు మాత్రమే ఛార్జింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో అసలు పెట్టకూడదు. ఫోన్ ఎక్కువగా వేడెక్కేలా చేయకుండా చూడాలి. ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ అసలు పెట్టకూడదు. మొత్తంగా, ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పని చేయాలంటే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.