వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి మందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే.. పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్నా విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులోనే దాఖలు చేయాలని సూచించడంతో హైకోర్టులోనే నిర్ణయం వెలువడనుంది. నిన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను కూడా తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
Also Read : India-UAE Gold Trade: ఆ దేశం నుంచి లక్షల టన్నుల బంగారం.. చౌకగా దిగుమతి చేసుకోనున్న భారత్!?
ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సునీత పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేయడంతో.. సునీత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Also Read : Passport: మైనర్లకు పాస్‌పోర్ట్ తప్పనిసరి.. దరఖాస్తు చేసే విధానం ఏమిటి?
