NTV Telugu Site icon

Avanthi Srinivas: వాలంటీర్లపై చంద్రబాబుది యూటర్న్‌.. పొరపాటున ఆయన అధికారంలోకి వస్తే అంతే..!

Avanthi

Avanthi

Avanthi Srinivas: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించిన ఆయన.. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు. భీమిలి రాజధాని కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ది జరుగుతుంది. కానీ, చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాజధానిని విశాఖపట్నం నుంచి అమరావతికి తరలించుకుపోతారని హెచ్చరించారు. ఇక, ఎన్నికల్లో రావడం.. గెలిచిన తర్వాత ముఖం చాటేయడం గంటా శ్రీనివాసరావుకు అలవాటేనంటూ సెటైర్లు వేశారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చి మాయ మాటలతో ఓట్లు చేయించుకోవడానికి గంటా వస్తున్నారు.. విశాఖపట్నం నార్త్ లో పోటీ చేస్తే డిపాజిట్లు రావని తెలిసి.. ఇప్పుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి మారాడు అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌. కాగా, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణల్లో వరుసగా దాడులు పెంచుతోన్న విషయం విదితమే.

Read Also: Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన! ఆప్ సర్కార్ ఏమంటుందంటే..!