Site icon NTV Telugu

Driver Booked for Kissing: 18 ఏళ్ల యువతికి ముద్దుపెట్టి ఆటోడ్రైవర్‌ వేధింపులు

Auto Driver

Auto Driver

Driver Booked for Kissing: మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్‌పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

బాలిక నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె ఆటోరిక్షా ఎక్కింది. దారిలో అతను తన చేతులు పట్టుకుని అనుచితంగా తాకాడని చెప్పింది. ఆమె ప్రతిఘటించినప్పటికీ, అతను ఆటోరిక్షాను రోడ్డు పక్కన ఆపి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. బాలిక ఆటోరిక్షా నుండి బయటపడింది. డ్రైవర్ తన ఫోన్‌లో ‘సచిన్’ పేరుతో నంబర్‌ను సేవ్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్

దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆటో-రిక్షా డ్రైవర్‌పై సంబంధిత సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version