NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ వాసులకు అలర్ట్.. ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలు ఎంతంటే?

Delhi

Delhi

Auto, Taxi Fares Increased In Delhi: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్‌ సర్కార్‌ ఆమోదం తెలిపింది. సవరించిన ధరలపై అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జనవరి 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ఆటో-రిక్షా, టాక్సీ ఛార్జీలను పెంచారు. సవరించిన ధరల ప్రకారం.. ఇకపై ఆటో ఎక్కిన ప్రయాణికుడు తొలి 1.5 కి.మీలకు (మీటర్‌ డౌన్‌ ఛార్జి) రూ.30లు (గతంలో రూ.25లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ప్రతి కి.మీకు చెల్లించాల్సిన ఛార్జి గతంలో రూ.9.50లుగా ఉండగా.. దాన్ని తాజాగా రూ.11కు పెంచారు. ఢిల్లీ ప్రభుత్వం సవరించిన రేట్లను నోటిఫై చేయడంతో ఢిల్లీలో టాక్సీలు, ఆటో-రిక్షాలను అద్దెకు తీసుకోవడానికి ఇప్పుడు మరింత ఖర్చు అవుతుంది.

America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు

ఇక ట్యాక్సీ విషయానికి వస్తే ఏసీ, నాన్‌ ఏసీ వాహనాలకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. ఏసీ వాహనాలకు మీటర్‌ డౌన్‌ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీస ఛార్జీని రూ.16 నుంచి రూ.20కి పెంచగా.. నాన్‌ ఏసీ వాహనాలకు రూ.14 నుంచి రూ.17కి పెంచారు. ఆటో ఛార్జీలు చివరి సారిగా 2020లో సవరించగా.. ట్యాక్సీల ఛార్జీలను 2013లో సవరించారు. అయితే, ఛార్జీలు పెంచాలంటూ ఆటో రిక్షా, ట్యాక్సీ అసోసియేషన్ల నుంచి దిల్లీ రవాణా మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు పెద్ద సంఖ్యలో విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఛార్జీలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. నగరంలో సీఎన్‌జీ ధరలు పెరగడంతో ఛార్జీల ఫిక్సేషన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఛార్జీలను సవరించింది.