NTV Telugu Site icon

Two, Three Wheelers Sales: జూన్లో పెరిగిన టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు.. ఎంత శాతం అంటే..?

Siam

Siam

జూన్‌లో కార్ల విక్రయ గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) విడుదల చేసింది. సియామ్ (SIAM) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024 జూన్లో భారత మార్కెట్‌లో PV విభాగంలో (హోల్‌సేల్) 3.37 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే గతేడాది జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే మూడు శాతం సానుకూల వృద్ధి సాధించాయి.

Read Also: Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డికి బిగ్‌ షాక్..! పార్టీకి ప్రధాన అనుచరుడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గుడ్‌బై..

టూ వీలర్, త్రీ వీలర్ విక్రయాలు ఎంత జరిగాయంటే..?
టూ వీలర్, త్రీ వీలర్ విక్రయాల గురించి మాట్లాడుకుంటే.. మార్కెట్ బలంగా ఉంది. సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 2023లో 13,30,826 యూనిట్ల విక్రయాలు జరగగా.. ఈ సంవత్సరం జూన్ నెలలో టూ వీలర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 21 శాతం పెరిగి 16,14,154 యూనిట్లు సేల్అయ్యాయి. ఇక.. త్రీవీలర్ల హోల్‌సేల్ విక్రయాలు గతేడాది జూన్‌లో 53,025 యూనిట్ల నుంచి 12 శాతం పెరిగి 59,544 యూనిట్లకు పెరిగాయి.

Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు

గత సంవత్సరం.. 2023లో భారతదేశంలో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అయితే ఈ సంవత్సరంలో గరిష్ట స్థాయిని పునరావృతం చేయడం కష్టంగా మారింది. 2024 మొదటి త్రైమాసికంలో వాహన విక్రయాలు బాగున్నాయని సియామ్ నివేదిక పేర్కొనగా.. 2024 రెండవ త్రైమాసికంలో అమ్మకాలు చాలా తగ్గాయి. కాగా.. వచ్చే పండుగల సీజన్‌లో వాహనాల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. 2023తో పోల్చితే 2024లో ఇప్పటివరకు అప్‌డేట్ చేయబడిన కార్ మోడల్‌లు లాంచ్ అయ్యాయి. ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్, త్రీవీలర్ మరియు టూ వీలర్స్ అన్ని సెగ్మెంట్లు గత ఏడాది క్యూ1తో పోలిస్తే 2024-25 క్యూ1లో వృద్ధిని నమోదు చేశాయి.