NTV Telugu Site icon

Rajanna Sirisilla: ఉచిత బస్సు రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు ఆందోళన

Auto

Auto

Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read Also: Assembly Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపడుతూనే ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేసే అవకాశం కల్పించడం వల్ల తమకు ఉపాధి పోయిందని ఆటో డ్రైవర్లు తమ గోడును వెల్లబుచ్చుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని జీవనం సాగిస్తు్న్న తమకు అప్పుల భారం పెరిగి జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత పథకం ద్వారా తమ ఉపాధి కోల్పోయామని.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Read Also: Fatima Vijay Antony: ఈ క్షణం నుంచి దేవుడు లేడు, ఆయన్ని నమ్మితే అంతే.. విజయ్ ఆంటోనీ భార్య షాకింగ్ ట్వీట్!