Site icon NTV Telugu

IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. ఆసీస్ ఆటగాళ్లు బీసీసీఐకి షాక్ ఇవ్వనున్నారా.?

Ipl 2025

Ipl 2025

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తిరిగి ప్రారంభమవుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో సహా పలు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు మళ్లీ భారత్‌కు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం నిలిపివేయబడ్డ ఐపీఎల్‌ను మే 16న తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. మే 30న ఫైనల్ జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ సస్పెండ్ అయిన వెంటనే స్టార్క్ తన భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీ చేరుకున్నాడు. అలా చేరిన అతడు అక్కడ మీడియాతో కూడా మాట్లాడేందుకు స్టార్క్ నిరాకరించాడు. అయితే, స్టార్క్ మేనేజర్ ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్ తిరిగి మొదలైన స్టార్క్ భారత్‌కు తిరిగిరాకపోవచ్చని సందేహం వ్యక్తం చేశాడు.

Read Also: Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!

అలాగే ఓ ఆస్ట్రేలియా పత్రిక ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తన ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్‌కు వెళ్లకపోయినా పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రచురించింది. పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ఆటగాళ్లపై కూడా అనుమానం నెలకొంది. వీరి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కోల్పోయిన నేపథ్యంలో.. వీరు జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు సిద్ధమవడానికి స్వదేశంలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read Also: IPL 2025: నాలుగు నగరాల్లోనే ఐపీఎల్.. ఆ జట్లకు చెరో పాయింట్‌!

ఐపీఎల్ సస్పెండ్ అయిన 24 గంటల్లోనే చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ భారత్ ను నుండి వారి స్వదేశాలకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడంలో ఆర్గనైజర్లకు పెద్ద తలా నొప్పిగా మారింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం మే 25 వరకు ఉన్న NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తర్వాత ఆటగాళ్లను కొనసాగించాలా లేదా అనే విషయంపై చర్చించనుంది. ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతే మాకు ప్రధానమని CSA స్పష్టం చేసింది.

Exit mobile version