Travis Head has joined SRH for IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి సమయం ఆరంభమైంది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ మొదలవనుంది. టోర్నీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో.. ఆయా ఫ్రాంచైజీలతో ప్లేయర్స్ కలుస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతో చేరగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు.
ఐపీఎల్ 2024 కోసం ఆదివారం ట్రావిస్ హెడ్ హైదరాబాద్ వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేడు హెడ్ కూడా వారితో కలవనున్నాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ తాజాగా జట్టుతో కలిశారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌తో చేరనున్నాడు.
Also Read: IPL 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఐపీఎల్ ప్రదర్శనే కీలకం కాదు!
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ 2023ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. అనంతరం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో హెడ్‌ను రూ.6.8 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో కూడా అతడు మెరుపులు మెరిపించాలని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.