NTV Telugu Site icon

IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా

Ind Vs Aus

Ind Vs Aus

టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. ఇక.. ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులతో బరిలోకి రానున్నారు. జట్టులోకి ఆడం జంపా, గ్లేన్ మ్యాక్స్ వెల్ చేరనున్నారు.

Read Also: Minister Niranjan Reddy: సంక్షేమంలో మనమే నంబర్ వన్

ఇండియా ప్లేయిన్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా ప్లేయిన్ ఎలెవన్: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ