మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం షార్జా మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్ (41) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ (2/32), ఫాతిమా ఖాతూన్ (2/18) సత్తా చాటారు. ఛేదనలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులకు పరిమితమైంది. శోభన మోస్తరీ (44) మాత్రమే రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సీ స్మిత్ (2/11), చార్లీ డీన్ (2/22), నటాలీ (1/20), సారా గ్లెన్ (1/22) ఆకట్టుకున్నారు.
మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదలెట్టింది. షార్జాలోనే శనివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. నీలాక్షిక సిల్వా (29 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మెగాన్ షట్ (3/12), సోఫి మోలనూ (2/20) మెరిశారు. ఛేదనలో ఆసీస్ ఇబ్బందుల్లో (35/3) పడినా.. బెత్ మూనీ (43 నాటౌట్) ఆదుకోవడంతో కోలుకుంది. పెర్రీ (17), గార్డ్‌నర్ (12) మూనీకి సహకరించారు. ఆసీస్ 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శ్రీలంకకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం విశేషం.