Site icon NTV Telugu

WI vs AUS: మరోసారి విండీస్ కు తప్పని ఓటమి.. 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం..!

Wi Vs Aus

Wi Vs Aus

WI vs AUS:కింగ్స్‌టన్‌ వేదికగా నేడు (జూలై 21) వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ ప్రేక్షకులను హైటెన్షన్ థ్రిల్లర్‌లో ముంచెత్తింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ షాయ్ హోప్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55, రెస్టన్ చేస్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. చివర్లో హెట్‌మయర్ 38 కాస్త వేగంగా ఆడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ తడబడడంతో స్కోరు 200 దాటలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో బెన్ ద్వార్షూయిస్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. మిచెల్ ఓవెన్, కానెల్లీ, ఎలిస్ చెరో వికెట్ తీసారు.

Mudragada Padmanabham: నిలకడగానే ముద్రగడ ఆరోగ్యం.. ఎవరూ ఆందోళన చెందొద్దు

190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది. మొదట్లో 12 పరుగులకే ఫ్రేజర్-మెగర్క్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కెమెరూన్ గ్రీన్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51, మిచెల్ ఓవెన్ 27 బంతుల్లో 6 సిక్సర్లతో 50 పరుగులతో ఆకట్టుకున్నారు. దీనితో మ్యాచ్‌ను ఆసీస్‌ వైపు తిప్పారు. అఖరి వరకు విండీస్ ఫైటింగ్ ఇవ్వగా, చివర్లో బెన్ ద్వార్షూయిస్, షాన్ అబోట్ స్కోరు పూర్తి చేశారు. ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 190 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక విండీస్ బౌలింగ్ వైపు చూసుకుంటే, గుడకేశ్ మోటీ, హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు. మిచెల్ ఓవెన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ తిరిగి బౌన్సు అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది – జూలై 25న భారీ ట్రీట్!

Exit mobile version