Site icon NTV Telugu

Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!

Ashes Series 2025

Ashes Series 2025

Ashes Series 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్’ (Ashes) సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి (నవంబర్ 21) నుంచి పెర్త్‌ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ చారిత్రక పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2017 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ ‘ఉర్న్’ (Urn) ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ రికార్డు అంతగా బాగా లేదు. 2010-11లో సాధించిన చారిత్రక విజయం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. పైగా గత మూడు పర్యటనల్లో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోర పరాజయాలను చవిచూసింది. అయితే, 2019, 2023లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లను డ్రాగా ముగించి గట్టి పోటీనిచ్చింది. ఈసారి తమ దూకుడైన ‘బజ్‌బాల్’ (Bazball) ఆటతో కంగారూలను వారి సొంత గడ్డపైనే ఓడించి, పాత బాకీ తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలు! ఢిల్లీలో ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ.. తనకేం తెలియదంటున్న శివకుమార్..

ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు అరంగేట్రం తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును (Playing XI) ఇప్పటికే ప్రకటించింది. స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్‌లో.. ఓపెనర్ జేక్ వెదరాల్డ్, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ టెస్టుల్లో అరంగేట్రం (Debuts) చేయనున్నారు. ఇక మరోవైపు ఇంగ్లండ్ గతంలోలా కాకుండా.. ఈసారి ఇంగ్లండ్ తమ తుది జట్టును (XI) నేరుగా ప్రకటించకుండా కేవలం 12 మంది సభ్యుల స్క్వాడ్‌ను మాత్రమే వెల్లడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టులో జో రూట్, హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.

ఆస్ట్రేలియా స్క్వాడ్: జేక్ వెదరాల్డ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్.

Bride Missing in Marriage: వధువు కోసం ఎదురు కట్నం ఇచ్చిన వరుడు.. హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన పెళ్లికూతురు

ఇంగ్లండ్ స్క్వాడ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్.

Exit mobile version