NTV Telugu Site icon

Australian Fan: లక్నో స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమాని హల్చల్.. గణపతి బప్పా మోరియా అంటూ స్లోగన్స్

Ganapathi Boppa

Ganapathi Boppa

Australian Fan: నిన్న జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆసీస్ జట్టు తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగగా.. తమ జట్టు గెలుపొందడంపై తీవ్ర ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఓ ఆస్ట్రేలియా అభిమాని. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గణపతి బప్పా మోరియా అంటూ స్టాండ్ లో గట్టిగా నినాదాలు చేశాడు. అయితే ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత ప్రేక్షకులతో కలిసి ఆస్ట్రేలియా అభిమానులు స్లోగన్స్ చేయడం కనిపిస్తుంది. ఓ విదేశీయుడు ఇలా గణపతి నినాదాలు చేయడంతో స్టాండ్ మొత్తం లేచి అతనికి సపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే హిందూ దేవుళ్ల పట్ల విదేశీయులకు ఎంతో నమ్మకం. వారు తమ దేశానికి వచ్చినప్పుడల్లా హిందూ దేవాలయాలను దర్శించుకోవడం అలవాటే.

Read Also: Leo: హైదరాబాదులో లియో ఈవెంట్.. విజయ్ వస్తాడా?

లక్నోలోని ఎకానా స్టేడియంలో నిన్న ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌లు ఆడగా, అందులో 1 విజయం సాధించగా, 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

Read Also: Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు