WTC Final: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రాబల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో ఆసీస్ కు 281 పరుగుల భారీ ఆధిక్యం కలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా మరోసారి తడబడింది. తొలుత ఖవాజా (6), గ్రీన్ (0), స్మిత్ (13) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. అయితే ఆ తర్వాత అలెక్స్ కేరీ (43), మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) మినిహాయించి ఎవరు రెండంకెల స్కోరును చేరుకోలేక పొయ్యారు. చివరిలో మిచెల్ స్టార్క్, అలెక్స్ కేరీల పోరాటంతో చెప్పుకో తగ్గ స్కోర్ చేయగలిగింది ఆస్ట్రేలియా.
Read Also: Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!
ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మరోసారి 4 వికెట్లు, లుంగీ ఎంగిడీ 3 వికెట్లు తీసారు. దీనితో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. చూడాలిమరి అగ్రెసివ్ బౌలింగ్ వేసే ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తగిన సమాధానం ఇస్తారో లేకుంటే మొదటి ఇంనింగ్స్ లో మాదిరి నీరు కారిపోతారో వేచి చూడాలి మరి.
Read Also: Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!
