NTV Telugu Site icon

IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారీ మార్పులతో ఇరుజట్లు

Ind Vs Aus

Ind Vs Aus

రాయ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్.. 2-1 ఆధిక్యంలో ముందుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో భారీ మార్పులు చేశాడు. టీమిండియా.. 4 మార్పులతో బరిలోకి దిగుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేష్, ఆర్ష్ దీప్ స్థానంలో దీపక్ చాహార్, తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ స్థానంలో జితేష్ శర్మ జట్టులో చేరనున్నారు. మరోవైపు.. అటు ఆస్ట్రేలియా కూడా భారీ మార్పులు చేసింది. 5 మార్పులతో ఆసీస్ రంగంలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ కు స్టోయినిస్, మ్యాక్స్ వెల్, ఇంగ్లిష్, రిచర్డ్ సన్, ఎల్లిస్ దూరం కానున్నారు.

Trisha: మన్సూర్ ఆలీ ఖాన్ ను వదిలేయండి.. పోలీసులకు త్రిష లేఖ.. ?

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్:
జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్/ కెప్టెన్), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.