Steve Smith can break Brian Lara’s 400 record says Michael Clarke: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ఎండ్ కార్డు వేశాడు. దీంతో టెస్టుల్లో వార్నర్ వారుసుడు ఎవరు? అని క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మార్కస్ హారిస్, మాట్ రెన్‌షా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్ రేసులో ఉన్నారు. అయితే ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ సరైనోడు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను స్టీవ్ స్మిత్‌నే ప్రారంభించాలని, స్మిత్ ఓపెనర్‌గా వస్తే బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు అని అన్నాడు.
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో ‘అరౌండ్ ది వికెట్’ షోలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి అవకాశం ఇవ్వాలి. 12 నెలల్లో నంబర్ 1 టెస్ట్ ఓపెనర్ అవుతాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు.. ఏ స్ధానంలో అయినా బాగా బ్యాటింగ్ చేస్తాడు. స్మిత్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. అయితే స్మిత్ కొన్నిసార్లు ఎల్‌బీడబ్ల్యు అవుతుంటాడు. ఎల్‌బీడబ్ల్యు కానీ బ్యాటర్ ఎవరుంటారు చెప్పండి’ అని ప్రశ్నించాడు.
Also Read: IND vs ENG Test: విద్యార్థులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫ్రీ!
‘స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్ అవుతాడు. బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్మిత్ రోజంతా బ్యాటింగ్ చేయగలడు’ అని మైకేల్ క్లార్క్ తెలిపాడు. స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 105 టెస్టులు ఆడి 9514 రన్స్ చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 239. త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్, వన్డే, టీ20ల సిరీస్ ఆసీస్ ఆడనుంది.