NTV Telugu Site icon

AUS vs IND: కోహ్లీ, రోహిత్ భవితవ్యం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది: గవాస్కర్

Kohli Rohit

Kohli Rohit

టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌తో తేలిపోనుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. ఈ ఇద్దరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే మరికొంతకాలం ఆడే అవకాశం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను గెలవడంపైనే దృష్టి సారించాలని, ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి ఆలోచించాలని సన్నీ సూచించారు. మొన్నటివరకు అత్యంత బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు కఠిన సవాల్ ఎదురుకానుందని గవాస్కర్ అన్నారు.

Also Read: Flying Flea C6 Price: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ ఇదే.. సింగిల్‌ ఛార్జింగ్‌పై 150 కిమీ!

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను గెలవడంపైనే దృష్టి సారించాలని నేను ఇప్పటికే చెప్పా. ఎలా గెలవన్నది పక్కన పెడితే.. సిరీస్‌ మాత్రం కచ్చితంగా నెగ్గాలి. ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి ఆలోచించాలి. మొన్నటివరకు బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కఠిన సవాల్ ఎదురుకానుంది. గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడిన సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల తమ స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. సీనియర్లు రోహిత్, కోహ్లీ కూడా భారీగా పరుగులు చేయలేదు. అందుకే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ వీరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆస్ట్రేలియాలో పేస్‌కు ఎదురొడ్డి నిలవాలంటే మాటలు కాదు. రోహిత్, కోహ్లీలు తమా సత్తాను నిరూపించుకొని కొనసాగుతారా? లేదా? చూడాలి’ అని అన్నాడు.

Show comments