NTV Telugu Site icon

AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే

Kl Rahul

Kl Rahul

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్‌, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ మాత్రం సత్తాచాటాడు. టాప్‌ఆర్డర్ మొత్తం విఫలం అయినా ఒంటరి పోరాటం చేశాడు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 80 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నాడు. కంగారో గడ్డపై ఎలాంటి అనుభవం లేని జురెల్ హాఫ్ సెంచరీ చేయగా.. సీనియర్ అయిన కేఎల్ రాహుల్‌ మాత్రం తడబడ్డాడు. దాంతో సోషల్ మీడియాలో రాహుల్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘ఇలా ఆడితే.. జట్టులో చోటు కష్టమే రాహుల్’, ‘అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా’, ‘ఇక భారత జట్టు గురించి మర్చిపో’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర! అంతకుమించి వెండి

ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్-ఏ 161 పరుగులకే ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (80) హాఫ్ సెంచరీ చేయగా.. దేవదత్ పడిక్కల్ (26), నితీశ్ రెడ్డి (16), ప్రసిధ్‌ కృష్ణ (14) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్, తనుష్ కొటియన్ (0) డకౌట్‌ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (4), ఖలీల్ అహ్మద్ (1), ముకేశ్‌ కుమార్ (5) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లు నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్స్ తీశారు.

Show comments