NTV Telugu Site icon

Virat Kohli: ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. కోహ్లీ పోస్ట్‌ వైరల్! గందరగోళంలో ఫాన్స్

Virat Kohli Icc Test Rankings

Virat Kohli Icc Test Rankings

ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం కాస్త ముందుగానే ఆసీస్ చేరుకున్న టీమిండియా.. ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై ఉన్న భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ పోస్టుతో అభిమానులు కొందరు గందరగోళంకు గురయ్యారు. ఈ పోస్ట్ దుస్తుల బ్రాండ్‌ ‘రాన్‌’ గురించే అయినా.. తొలి లైన్లలో వాడిన పదాలు చూసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ విరాట్ ఏం రాసుకొచ్చాడంటే?..

‘వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాము. మేం ఒక అభిరుచికే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా రెండుసార్లు గాడి తప్పాము. మేము సంవత్సరాలుగా ఎంతగానో మారాం. కానీ ఎల్లప్పుడూ మా ప్రత్యేకత అలాగే ఉంది. కొందరు మమ్మల్ని వెర్రివాళ్లనుకున్నారు. కొంతమందికి మేం అర్ధం కాలేదు. మేం అవేమీ పట్టించుకోలేదు. మేమేంటో నిరుపించుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నాం. ఈ 10 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాము. కరోనా కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. అందరికంటే భిన్నంగా ఉండటమే మమ్మల్ని ప్రత్యేకంగా మార్చింది. అదే రాన్‌. మరో పదేళ్లు కూడా ఇలాగే కొనసాగుతాం. రాన్‌ ఓ సరైన వ్యక్తి కోసం’ అని కోహ్లీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. రాన్‌ పదేళ్ల ప్రయాణం సందర్భంగా విరాట్ ఈ పోస్ట్ పెట్టాడు.

Also Read: Redmi Note 14 Launch: రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

విరాట్ కోహ్లీ ఈ పోస్టుకు వాడిన వైట్‌ బ్యాగ్రౌండ్‌ టెంప్లేట్‌ను 2022లో టెస్ట్‌ కెప్టెన్సీ వదిలేసినప్పుడు వాడాడు. ఇప్పుడు కూడా అదే టెంప్లేట్‌ను వాడడంతో.. విరాట్ ఏదో షాక్ ఇస్తున్నాడని అభిమానులు అనుకున్నారు. పూర్తి నోట్ చదివిన ఫాన్స్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్న కోహ్లీ.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌పై దారుణంగా విఫలమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ఫామ్ అందుకుంటాడని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.