NTV Telugu Site icon

AUS vs IND: కమిన్స్‌కు ఎంత బలుపు.. భారత ఫాన్స్ ఫైర్!

Pat Cummins

Pat Cummins

మరో కొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం జట్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నాయి. పెర్త్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే.. టీమిండియా నుంచి ఎవరిని ఎంచుకుంటావు? అని కమిన్స్‌ను ప్రశ్నించారు. ఎవరినీ ఎంచుకోనని అతడు బదులిచ్చాడు. దాంతో భారత ఫాన్స్ ఫైర్ అవుతూ.. ‘కమిన్స్‌కు ఎంత బలుపు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

రోహిత్‌ శర్మను ట్రావిస్ హెడ్ ఎంచుకున్నాడు. ‘నేను రోహిత్ శర్మను ఆసీస్ జట్టులోకి తీసుకుని.. టాప్‌ ఆర్డర్‌లో ఆడిస్తాను. రోహిత్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. అందరూ విరాట్ కోహ్లీని ఎంచుకుంటానని అనుకోవచ్చు కానీ.. నేను మాత్రం రోహిత్‌ను ఎంచుకుంటా’ అని హెడ్ చెప్పాడు. విరాట్ కోహ్లీని తీసుకుంటానని నాథన్ లైయన్ చెప్పాడు. ‘టాప్‌ ఆర్డర్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లకు తోడుగా విరాట్‌ కోహ్లీ ఉంటే.. బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటుంది. 2014లో ఓవల్‌లో జరిగిన టెస్టులో విరాట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. నా బౌలింగ్‌లో సునాయసంగా పరుగులు చేశాడు’ అని లైయన్ చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్‌ను మిచెల్ మార్ష్.. జస్ప్రీత్ బుమ్రాను స్కాట్ బోలాండ్ ఎంచుకున్నారు.

గత రెండు పర్యాయాలూ ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్‌లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈసారి గెలుపుపై పెద్దగా ధీమా లేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలి రోజుల్లో పెద్దగా రన్స్ చేయలేదు. న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ భారత జట్టును కలవరపెడుతున్నాయి. బౌలర్ల మీదే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్‌ విభాగం సత్తా చాటితే.. సిరీస్‌లో పైచేయి సాధించడానికి అవకాశముంటుంది.

Show comments