NTV Telugu Site icon

IND vs AUS: లంచ్‌ బ్రేక్.. టాప్‌ ఆర్డర్‌ విఫలం! రాహుల్ ఒక్కడే

Kl Rahul

Kl Rahul

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. న్యూజీలాండ్‌పై మాదిరే ఆసీస్‌పై కూడా భారత టాప్‌ ఆర్డర్ విఫలమైంది. యువ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్‌ కాగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే కాస్త పోరాడాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 రన్స్ చేసింది.

Also Read: IND vs AUS: పెర్త్ టెస్టుకు అరుదైన ఘనత.. 1947 తర్వాత ఇదే మొదటిసారి!

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ డకౌట్ ఔటయ్యాడు. గిల్ స్థానంలో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ క్రీజ్‌లో కుదరుకునేందుకు ప్రయత్నించినా.. ఆసీస్ పదునైన బౌలింగ్‌ ముందు నిలవలేకపోయాడు. 23 బంతులు ఆడినా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించినా.. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిరాశపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం పరుగులు చేశాడు. లంచ్‌ బ్రేక్ ముందు పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో రిషభ్ పంత్ (10), ధ్రువ్ జురెల్ (4) ఉన్నారు. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.