ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్‌బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్‌దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు.
టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని మేము అనుకున్నాం. ఇది మంచి వికెట్. రెండవ ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు. ఇక్కడ మూడు, నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. నిన్నటో పోలిస్తే నేడు చలిగా ఉంది. మా ఆటగాళ్లకు ఏమి చేయాలో తెలుసు. అందరిపై బాధ్యత ఉంది. వారు ఆటను ఆస్వాదిస్తారు. జట్టును ఎంచుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. చాలా ఎంపికలు ఉండటం జట్టుకు మంచిది. రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రెడ్డిలు ఆడడం లేదు’ అని సూర్య చెప్పాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఒవెన్, స్టాయినిస్, ఫిలిప్, బార్ట్‌లెట్, ఎలిస్, కునెమన్, హేజిల్‌వుడ్.
