Site icon NTV Telugu

AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!

Aus Vs Eng 4th Test (1) (1)

Aus Vs Eng 4th Test (1) (1)

AUS vs ENG 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. అతనికి తోడుగా అట్కిన్సన్ 2 వికెట్లు.. స్టోక్స్, కార్స్ ఒక్కో వికెట్‌తో సహకరించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మైఖేల్ నేసర్ (35), ఉస్మాన్ ఖవాజా (29) మాత్రమే కాస్త పోరాడారు.

Virat Kohli: కింగ్ ఎక్కడున్నా కింగే.. కొనసాగుతున్న కోహ్లీ వీరబాదుడు.. ఖాతాలోకి మరో రికార్డ్..!

ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కూడా ఆసీస్ బౌలింగ్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. కేవలం 29.5 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో హ్యారీ బ్రుక్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నేసర్ 4 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లతో అదరగొట్టారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్ నష్టంలేకుండా 4 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ మొత్తం 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.

1.5K 144Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Realme 16 Pro..!

Exit mobile version