Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
- తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 53 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్..
- పేసర్ హసన్ మహ్మద్ 17 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు..
- స్టీవ్ స్మిత్ 109 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 పరుగులు..
- తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లాదేశ్ 102 పరుగుల వెనుకంజలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aus vs Ban: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు బంగ్లాదేశ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ఇంకా 102 పరుగుల వెనుకంజలో ఉంది.
ప్రారంభంలోనే ఎదురుదెబ్బ:
ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, జేక్ వెదరాల్డ్ తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే బంగ్లాదేశ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచారు. హసన్ మహ్మద్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ట్రావిస్ హెడ్ 22 పరుగులకు, జేక్ వెదరాల్డ్ 23 పరుగులకు హసన్ మహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. మార్నస్ లబుషేన్ కేవలం ఒక్క పరుగుకే ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Also Read
- 5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
- Harbhajan Singh: "అస్సలు భయపడొద్దు".. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టును మరోసారి ఆదుకున్నారు. 109 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 పరుగులు చేశాడు. అయితే 189 పరుగుల వద్ద హసన్ మహ్మద్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కామెరాన్ గ్రీన్ 13, అలెక్స్ క్యారీ 19, బీయూ వెబ్‌స్టర్ 12, పాట్ కమిన్స్ 9, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లయన్ 7 పరుగులు చేశారు. చివరకు జోష్ హేజిల్‌వుడ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
హసన్ మహ్మద్ 6 వికెట్లు:
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ అదరగొట్టాడు. 17 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో ఆస్ట్రేలియా టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అతని తోడుగా టాస్కిన్ అహ్మద్ 2 వికెట్లు, ఎబాదత్ హొస్సేన్ కూడా 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా 198 పరుగులకే ఆలౌటైంది.
మంచి ఆరంభం:
ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఆ జట్టుకు కూడా ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ 20 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ లయన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత తంజిద్ హసన్, మొమినుల్ హక్ కలిసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తంజిద్ హసన్ 67 బంతుల్లో 32 పరుగులతో, మొమినుల్ హక్ 49 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 102 పరుగుల దూరంలో ఉంది. మొదటి రోజు ఆటను పరిశీలిస్తే బంగ్లాదేశ్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.
తాజావార్తలు
-
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
-
Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
-
Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
ట్రెండింగ్
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..