NTV Telugu Site icon

Champions Trophy 2025: మెగా టోర్నీలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఆ ఆటగాడే..

Bumra, Siraj

Bumra, Siraj

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది. బుమ్రా వన్డే సిరీస్ ఆడలేదు. కాగా.. ఈ టోర్నమెంట్‌లో బుమ్రా ఇప్పటి వరకు ఆడలేదు.

Read Also: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు తేజాలు

కాగా.. గాయం కారణంగా, బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా ఆడలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు.. బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక సమాచారం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అతులు మాట్లాడుతూ, “ఒక విధంగా, బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. మహమ్మద్ సిరాజ్ అనుభవంతో పాటు బౌలింగ్ నైపుణ్యాలు కూడా బుమ్రాకు బాగా సరిపోతాయి” అన్నారు. వాసన్ మాట్లాడుతూ, “బుమ్రా మరియు షమీ ఇద్దరూ జట్టులో ఉంటే భారత్ టోర్నమెంట్ గెలవడానికి బలమైన పోటీదారులుగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. మొత్తం మీద 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా గాయం కారణంగా జట్టులో మార్పులు ఉండవచ్చు.

Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.