Site icon NTV Telugu

Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..

Atti Satyanarayana

Atti Satyanarayana

ఇవాళ రాజమండ్రిలో మీడియా ముందుకు జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అత్తి సత్యనారాయణ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు.

Also Read:Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు నా పేరు చెప్పారని వెల్లడించారు. థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు.. ఒక జర్నలిస్టు అడిగిన దానికి సినిమాలు లేక థియేటర్లు మూసి వేయాల్సి వస్తుందనీ అన్నాను అని తెలిపారు. జూన్ 1న బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని చెప్పారు. ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారని ఫైర్ అయ్యారు. కమల్ హాసన్ ను మించి ఆస్కార్ రేంజ్ లో దిల్ రాజు నటించాడని అత్తి సత్యనారాయణ వెల్లడించాడు.

Also Read:KTM E-Duke: బైక్ లవర్స్ గెట్ రెడీ.. కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది..

నిర్మాత దిల్ రాజు సోమవారం హైదరాబాద్ మీడియా సమావేశంలో అత్తి సత్యనారాయణ పేరు వెల్లడించడంతో జనసేనలో కలకలం రేగింది. తక్షణమే రాజమండ్రి సిటీ ఇన్చార్జి తో పాటు పార్టీ సభ్యత్వం నుంచి అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేశారు. నిజా నిజాలు తేలే వరకూ జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరోవైపు థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరు ఉన్నారో విచారణ కొనసాగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇప్పటికే థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో థియేటర్లో అనేక లోపాలు గుర్తించారు.

Exit mobile version