Site icon NTV Telugu

Attempted R*ape: కళాశాలలో దింపుతానని నమ్మించి.. బాలికను బైక్ పై ఎక్కించుకుని అత్యాచారయత్నం

Karimnagar

Karimnagar

కరీంనగర్ జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపింది. అలుగునూర్ కాకతీయ కాలువ పరిసరాల్లో ఓ బాలికపై అత్యాచారయత్నానానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట సమీపంలోని వడ్డేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక కరీంనగర్లోని ప్రైవేట్ ఒకేషనల్ కళాశాలలో ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి కళాశాలలో దింపుతానని అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని హైదరాబాద్ రోడ్డు గుండా ఎల్ఎండి పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లాడు.

Also Read:ENG vs IND: భారత్ ఓటములకు ప్రధాన కారణం అదే: టీమిండియా కోచ్‌

అనుమానం వచ్చి అప్రమత్తమైన అమ్మాయి.. కాకతీయ కెనాల్ పరిసర ప్రాంతాల్లో బైక్ నుంచి దూకడంతో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి నిందితునికోసం గాలిస్తున్నట్లు ఎల్ఎండీ సిఐ సదన్ కుమార్ తెలిపారు.

Exit mobile version