Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరాంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ, నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలోని 143వ పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది.
ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్‌కు గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటివరకు కిడ్నాప్‌కు గురైన యువతి ఎవరు అన్నది స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని థార్ కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!