NTV Telugu Site icon

Attacks: హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు..!

2

2

ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ పై దాడులు చేస్తున్న భాగంలో.. హెజ్ బొల్లా., గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దింతో హెజ్ బొల్లా పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు చేస్తున్నాయి. ఇకపోతే., మరోసారి ఇజ్రాయెల్ దళాలు ఆ హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై త్రీవ స్థాయిలో విరుచుకుపడ్డాయి. దాంతో ఇజ్రాయెల్ దళాలు బుధవారం నాడు సిరియాపై భారీగా దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు చెందిన హెజ్ బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి.

Also Read: West Bengal: అందరు చూస్తుండగానే.. ఓ యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..

ఇకపోతే జరిగిన దాడుల్లో సైనిక కీలక స్థావరాలు, మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్ దళాలు చేసిన పనులకి సంబంధియించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. సిరియా దేశంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరించింది. సిరియా భూభాగం నుంచి హెజ్ బొల్లా కార్యకలాపాలను తమిరికొట్టాలని పరోక్షంగా ఇజ్రాయెల్ సిరియాను హెచ్చరించింది. ఈ విషయంలో హెజ్ బొల్లా కనుక బలోపేతంకు ప్రయత్నిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.

Also Read: Viral Video : కారులో చికెన్ ఫ్రై.. ఎలా వస్తాయి తల్లి ఇలాంటి ఐడియాలు..

గాజా లో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని హెజ్ బొల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. దాంతో ఇజ్రాయెల్ సైన్యం పై హెజ్ బొల్లా గ్రూప్ గాజాకు మద్దతుగా దాడులకు తెగబడింది. ఈ నెపంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ మిలిటెంట్ గ్రూప్ దాడులను చేస్తోంది. ఇకపోతే తాజాగా ఇజ్రాయల్ సైన్యం బుధవారం హెజ్ బొల్లా స్థావరాలపై జరిపిన దాడుల్లో ఈ సంస్థ ప్రధాన విభాగమైన రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతి చెందినట్లు సంస్థ ప్రకటించింది.