MLA Chintamaneni Prabhakar: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది.. ఈ ఘటనతో ఒక్కసారిగా దెందులూరు రగిలిపోయింది.. దీంతో, బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠగా మారిపోయింది.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసీపీ నేతలు హత్యాయత్నం చేసినట్టుగా ఆరోపిస్తున్నారు.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగి.. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసీపీ అల్లరి మూకల దాడికి యత్నించాయని.. అంతేకాకుండా చింతమనేని సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని.. సిబ్బంది అప్రమత్తతతో పెనుముప్పు తప్పిందని చెబుతున్నారు కూటమి నేతలు.. ఈ దాడిలో స్వయంగా దెందులూరు వైసీపీ ఇంచార్జ్ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది పాల్గొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు..
Read Also: Minister Nara Lokesh: జేఈఈ టాపర్‌ను అభినందించిన మంత్రి లోకేష్.. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు..
అయితే, బుధవారం రాత్రి వట్లురులో ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు ఉద్దేశ్య పూర్వకంగా తమ కారును అడ్డుపెట్టి గొడవను అబ్బయ్య చౌదరి సృష్టించారని.. అతని అనుచరులు ముందుగానే సిద్ధంగా ఉన్న వ్యక్తులతో వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి.. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చింతమనేని వర్గం చెబుతోంది.. కారు అడ్డం తీయాలంటూ చింతమనేని డ్రైవర్ కోరగా.. పథకం ప్రకారం ఒక్కసారిగా విరుచుకుపడిన దాదాపు 25 మంది అల్లరి మూకలు.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, డ్రైవర్ సుధీర్, గన్ మెన్ రవీంద్ర పై ఐరెన్ రాడ్, కర్రలతో దాడికి యత్నించారని.. ఆ దాడిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యక్తిగత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. అక్కడి నుంచి పరారయ్యారని చెబుతున్నారు.